Naveen Yadav Fires BRS: నా మీద కేసులు నిజమైతే రాజకీయాలు వదిలేస్తా.. నవీన్ యాదవ్ సవాల్
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:24 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు.
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు. తన మీద పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి.. హైదరాబాద్ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు నవీన్ యాదవ్.
కానీ ఆ కేసులు ఫాల్స్ అని తేలితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులపై, అనుచరులపై ఒకే సంవత్సరంలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. తన మీద రౌడీ అని ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని విమర్శించారు నవీన్ యాదవ్.
తనకు న్యాయవ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు. అలాగే, కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసు నమోదైందని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పైన విశ్వాసం ఉంచారని నవీన్ యాదవ్ నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపై సీఎం సమీక్ష..
మావోయిస్టులకు బిగ్ షాక్.. అగ్రనేతల లొంగుబాటు
Read Latest Telangana News And Telugu News