Operation Sindoor: భారీగా పతనమైన పాక్ స్టాక్ మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్..
ABN , Publish Date - May 08 , 2025 | 02:22 PM
Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.

Operation Sindoor Pakistan Stock Market: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించిన తర్వాతి రోజే కరాచీ, లాహోర్‌లలో పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నివేదికలు వెలువడటంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE100 రోజు ప్రారంభంలోనే 6 శాతానికి పైగా పడిపోయింది.
భారతదేశంతో ఉద్రిక్తతలు పెరగడంతో, మే 8, గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ అమ్మకాల్లో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఫలితంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాని బెంచ్‌మార్క్ ఇండెక్స్ 6.3% తగ్గి ట్రేడింగ్ ఆగిపోయింది. కరాచీ స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూడటం ఇది వరుసగా నాలుగో సెషన్. గత ట్రేడింగ్ సెషన్‌లో కూడా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో భారతదేశం వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పాకిస్థాన్ స్టాక్‌లు కుప్పకూలాయి. కాగా, బుధవారం నాడు KSE100 6,948.73 పాయింట్లు లేదా 6.32 శాతం క్షీణించి 103,060.30 వద్ద ముగిసింది. తర్వాత 100 ప్యాక్ ఇండెక్స్ 3,559.48 పాయింట్లు లేదా 3.13 శాతం పెరిగి 1,10,009.03 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, భారత స్టాక్ మార్కెట్లు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగుతున్నాయి.
Read Also: Today Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..