BSNL 1Rupee Plan: BSNL అద్భుతమైన ప్లాన్.. రూ.1కే నెల రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2జీబీ డేటా..!
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:25 PM
స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒకే ఒక్క రూపాయికి 30 రోజుల 4G ప్లాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
BSNL 4G Freedom Plan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక అదిరిపోయే ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని పేరు 'ఫ్రీడమ్ ప్లాన్'. దీని ధర కేవలం రూ.1. స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు వారాల ముందు ఈ ప్లాన్ ప్రారంభమైంది. పరిమిత సమయం వరకు మాత్రమే యూజర్స్ కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు నెల పాటు ఉచిత 4G సేవలను పొందవచ్చు.
'భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని.. భారతదేశం స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4G టెక్నాలజీని ఉచితంగా పొందే అవకాశాన్ని పౌరులకు అందిస్తోంది' అని BSNL ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిమిత కాల ఆఫర్ ఆగస్టు 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు చెల్లుతుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 SMSలు, ఒక BSNL సిమ్‌ను ఉచితంగా లభిస్తుంది.
ప్లాన్ వివరాలు:
అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్/ఎస్టీడీ)
రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
రోజుకు 100 SMSలు
ఒక BSNL సిమ్ - పూర్తిగా ఉచితం
మేక్-ఇన్-ఇండియా నినాదంతో బిఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా లక్ష 4జి సైట్‌లను ఏర్పాటు చేస్తోందని.. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా కస్టమర్లు 30 రోజుల పాటు ఉచితంగా స్వదేశీ నెట్‌వర్క్‌ను ఎంజాయ్ చేస్తారని విశ్వసిస్తున్నట్లు BSNL సంస్థ ప్రతినిధి తెలిపారు. సురక్షితమైన, అధిక నాణ్యతగల మొబైల్ కనెక్టివిటీ సరసమైన ధరకే అందించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల పౌరులు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్‌ను సందర్శించడం ద్వారా లేదా 1800-180-1503 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఫ్రీడమ్ ప్లాన్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి
యస్ బ్యాంక్ లోన్ మోసం కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
పిఎఫ్ ఖాతాలో సమస్య ఉందా? ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి