Nimmala RamaNaidu అందుకే ఆరాటపడుతున్న జగన్
ABN , Publish Date - Aug 05 , 2025 | 07:56 PM
రాష్ట్రంలో కలియగ రాజకీయాలు నడుస్తున్నాయంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రామానాయుడు స్పందించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్‌పై ఆయన కాస్తా ఘాటుగా స్పందించారు.
గుడివాడ, ఆగస్ట్ 05: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. దానిని కాపాడుకోవడానికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరాటమంతా అని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో కలియగ రాజకీయాలు నడుస్తున్నాయంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రామానాయుడు కౌంటర్ ఇచ్చారు.
మంగళవారం గుడ్లవల్లేరులో మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. మామిడికాయలకు... తలకాయలకు తేడా తెలియని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని చెప్పాలని.. అంతేకానీ 2 కళ్లు పీకేస్తాం.. కాలు తీసేస్తాం... రప్పా రప్పా అంటూ నరికేస్తామంటే కుదురుతుందా అంటూ వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
మద్యం కుంభకోణంలో జగన్ ముఠా లూటీల సొమ్ము దొరకడంతో.. ఆయనలో ఆందోళన మొదలైందన్నారు. అదీకాక వైఎస్ జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల మాదిరిగా వైఎస్ జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంసం సృష్టించేందుకే.. పరామర్శల ముసుగులో వైఎస్ జగన్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
2024లో జగన్ నుండి.. ఏపీ ప్రజలు విముక్తి పొందారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉండే.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటారని వైసీపీ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని భావనతో.. రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టిస్తున్నారంటూ వైఎస్ జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి కొంప దాటి బయటికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అంటూ వైఎస్ జగన్ ఈ సందర్భంగా నిలదీశారు.
అంతకుముందు మంత్రి నిమ్మల రామానాయుడు పెడన, గుడ్లవల్లేరు మండలాల్లోని పలు గ్రామాల్లోని కాలువలు, లాకులకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యా గ్రామస్తుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రి నిమ్మల వెంట పెడన,గుడివాడ ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: కేటీఆర్
మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం
For More AP News and Telugu News