Share News

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:26 PM

ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల
Minister Nadendla Manohar

విశాఖపట్నం : రాష్ట్రంలో మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రేషన్ సరుకులను ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..


ఏటీఎం కార్టు సైజులో..

ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. రేషన్ షాపులు ద్వారా జీసీసీ ఉత్పత్తులు అందించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాలుగు కోట్ల మందికి రేషన్ సరుకులు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ రాయితీ విషయంలో కూడా డిజిటల్ వారెంట్ కూపన్ను అందిస్తున్నట్లు తెలిపారు.


పంపిణీ ఇలా...

మూడు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని పేర్కొన్నారు. 65 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ వరకు ఇంటివద్దకే సరకులు అందిస్తామని వివరించారు.


ఎండీయూ వాహనాలు తొలగింపు విషయంలో సుమారు రూ.200 కోట్లు నష్టం జరిగిన ముందుకు వెళ్ళామని నాందెడ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. దీపం పథకం ద్వారా ఫేజ్-1లో కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించినట్లు తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఇప్పటికే ఆయా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశాని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా పెట్టినట్లు, చట్టంలో మార్పులు కూడా తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది.. సీబీఐ స్పష్టం

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎన్ని రోజులో తెలుసా..

Updated Date - Aug 05 , 2025 | 07:12 PM