MP Sri Bharat Comments ON AP Development: ఆర్థిక ఇబ్బందుల్లోనూ అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోంది
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:11 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ (Visakhapatnam MP Sri Bharat) ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) విశాఖ జిల్లా తెలుగుదేశం కార్యదర్శి గొట్టుపాటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో విమాన్ నగర్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతి యుగపురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) విశాఖలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ కార్యక్రమాలు వేర్వేరుగా ఉన్నాయని.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానంటే అది కేవలం వారిపై ఉన్న గౌరవమేనని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ పర్యటన

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం వైజాగ్ కన్వెన్షన్‌లో జరిగే ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు మంత్రి లోకేష్. అలాగే చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌లో ఏఐ ల్యాబ్స్‌ను మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్
For More AndhraPradesh News And Telugu News