Share News

Palla Srinivasa Rao Comments on Lokesh: నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:59 PM

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.

Palla Srinivasa Rao Comments on Lokesh: నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

విశాఖపట్నం, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) అని.. వారు ఆలోచనపరంగా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ప్రశంసించారు. ఇవాళ(సోమవారం) విశాఖపట్నంలోని కొత్త గాజువాక 66వ వార్డ్ కనితి రోడ్డులో స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.


ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈ రోజు చేపట్టామని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులపై, భూముల పట్టాలపై రాజముద్ర ఉండాలి తప్పా నాయకుల బొమ్మలు ఉండకూడదని ఆకాంక్షించారు. లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదవాడికి ఇచ్చిన రేషన్ సరుకులు వృథా చేయకూడదని కోరారు. రేషన్ సరుకులు పాదదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు.


నిధులు విడుదల..

మరోవైపు.. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 8 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి 46 లక్షల 21 వేల 223 క్యూఆర్ ఆధారిత స్మార్ట్ కార్డుల తయారీ, పంపిణీకి నిధులు జారీ చేసింది. ఒక్కోస్మార్ట్ రేషన్ కార్డు తయారీకి రూ. 4. 66 ఖర్చు అవుతోందని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లాయీస్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎక్స్ అఫిషియో కార్యదర్వి సౌరబ్ గౌర్ జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి

ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 05:11 PM