Share News

Huge Explosion in AP: ఏపీలో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 02:08 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

Huge Explosion in AP: ఏపీలో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు
Huge Explosion in AP

పార్వతీపురం మన్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District)లో ఇవాళ(ఆదివారం) భారీ పేలుడు (Huge Explosion) సంభవించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లు దించుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా... మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.

క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, సామగ్రి మెుత్తం ధ్వంసమయ్యాయి.


ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ అధికారులు, స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. బాణసంచా పేలుడా? లేక ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2025 | 02:44 PM