Share News

Covid: ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు

ABN , Publish Date - May 22 , 2025 | 09:13 PM

Covid positive case: 2020-2021లో కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.

Covid: ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
Covid positive case

అమరావతి: విశాఖపట్నంలో (Visakhapatnam) ఇవాళ(మే22) కోవిడ్ పాజిటివ్ కేసు (Covid positive case) నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెం, యూపీహెచ్‌సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


విశాఖపట్నంలోని విజయా డయాగ్నోస్టిక్స్‌లో జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా పేర్కొంటూ రిపోర్ట్ వచ్చింది. ఈరోజు సాయంత్రానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికీ సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, 2020-2021లో కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ

Read latest AP News And Telugu News

Updated Date - May 22 , 2025 | 10:02 PM