Share News

CM Chandrababu: స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 05 , 2025 | 03:29 PM

తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

CM Chandrababu: స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం
CM Nara Chandrababu Naidu

పార్వతీపురం మన్యం జిల్లా, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చదివారని.. రాష్ట్రంలోని విద్యార్థులను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. లోకేశ్ కోసం తాను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యశాఖలో నూతన ఒరవడి సృష్టిస్తానని లోకేశ్ అన్నారని.. ఈ విషయంలో తాను ఆశీర్వదించానని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్‌ను ఇవాళ(శుక్రవారం) నిర్వహించారు. మన్యం జిల్లా బామినిలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు.


తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వారి ద్వారా దశల వారిగా.. ఉపాధ్యాయులు అందరికీ.. ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని తెలిపారు. గతంలో ఉపాధ్యాయులను అనేక వేధింపులకు గురి చేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గౌరవించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించటంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.


జగన్ హయాంలో విద్యా వ్యవస్థను అస్థవ్యస్తం చేశారని.. ఆ పరిస్థితిని తమ ప్రభుత్వంలో చక్కదిద్దామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని వివరించారు. కేంద్రంలో వికసిత్ భారత్ తీసుకువస్తే రాష్ట్రంలో స్వర్ణధ్రా నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో పిల్లలు, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి, ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుతారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వినూత్నమైన మార్పులు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీసుకువచ్చారని కొనియాడారు. ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రస్తుతం వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారని.. నూతన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

Read Latest AP News and National News

Updated Date - Dec 05 , 2025 | 03:57 PM