Share News

Minister Nara Lokesh: లోకేష్ చొరవతో.. విశాఖలో డాటా సిటీకి కేంద్రం చర్యలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 09:09 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Minister Nara Lokesh: లోకేష్ చొరవతో.. విశాఖలో డాటా సిటీకి కేంద్రం చర్యలు
Minister Nara Lokesh

విశాఖపట్నం, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కృషి ఫలిస్తోంది. విశాఖపట్నంలో డాటా సిటీ (Data City) ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డాటా సిటీ ఏర్పాటుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది.


నైపుణ్యం ఉన్న యువతను మరింత ప్రోత్సహించేందుకు అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీఛార్జ్ సెంటర్స్ డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్స్‌తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం డాటా సిటీ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. డాటా సిటీ ఏర్పాటుకు వీలు కల్పించే విధంగా అవసరమైన న్యాయ నిబంధనల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని లోక్‌సభలో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం కోసం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యులను మంత్రి నారా లోకేష్ కలిశారు. లోకేస్ తన తాజా ఢిల్లీ పర్యటనలోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విశాఖలో డాటా సిటీ ఏర్పాటుపై నారా లోకేష్ మద్దతు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 09:19 PM