Share News

CM Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Dec 12 , 2025 | 07:49 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.

 CM Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
AP CM Nara Chandrababu Naidu

అల్లూరి సీతారామరాజు జిల్లా, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharama Raju District) చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.


సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈప్రమాదానికి కారణమైన బస్సు విగ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. అరకు నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.


ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం..

బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.


ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని... పలువురు మృతిచెందగా... గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని తెలిపారు అధికారులు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 08:24 AM