AP Assembly Day-5: ప్రతి జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీలు : మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:43 AM
చిత్తూరు జిల్లాలో ఉన్న యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. భాషా సంబంధమైనది కాబట్టి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రశ్నోత్తరాల పర్వం మొదలైంది. చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లాకు ఒక ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలన్న అంశంపై పని చేస్తున్నామని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. భాషా సంబంధమైనది కాబట్టి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 9600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్‌ను అమలు చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా టీచర్లను ఏర్పాటు చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థి దశలోనే నైతిక విలువలు అలవర్చుకోవడం చాలా ముఖ్యమని లోకేశ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు