Share News

Breaking News: ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు..

ABN , First Publish Date - Jan 22 , 2025 | 10:40 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు..
Breaking News

Live News & Update

  • 2025-01-22T18:00:12+05:30

    ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు..

    • మహారాష్ట్ర: జల్‌గావ్‌లో రైలు ప్రమాదం, పలువురు మృతి.

    • ప్రయాణికుల మీదుగా దూసుకెళ్లిన రైలు.

    • చైన్‌లాగి ఒక రైలు నుంచి దిగిన ప్రయాణికులు.

    • ఒక రైలు దిగి పట్టాలు దాటుతున్న వారిని ఢీకొట్టిన మరో రైలు.

  • 2025-01-22T13:12:36+05:30

    పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఆటో డ్రైవర్ హత్య..

    • హనుమకొండలో దారుణం

    • పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య

    • అదాలత్ జంక్షన్ సమీపంలో ఘటన

    • మృతుడు మడికొండ కు చెందిన మాచర్ల రాజ్ కుమార్‌గా గుర్తింపు

    • ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సుబేదారి పోలీసులు

  • 2025-01-22T12:39:13+05:30

    దిల్‌ రాజు కుమార్తె ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

    • దిల్‌ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

    • ఇంట్లో డిజిటల్ లాకర్లను ఓపెన్ చేసిన ఐటీ అధికారులు

    • హన్సిత రెడ్డి సమక్షంలో లాకర్లు తెరిచిన అధికారులు

    • మరికాసేపట్లో బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్న అధికారులు

  • 2025-01-22T12:08:50+05:30

    డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు

    • స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు

    • హైదరాబాద్‌లోని సుకుమార్ నివాసంలో ఐటీ రైడ్స్

    • పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై రెండు రోజులుగా ఐటీ రైడ్స్

    • సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ తనిఖీలు

    • దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలో కొనసాగుతున్న రైడ్స్

  • 2025-01-22T10:40:49+05:30

    వైసీపీ మాజీ మంత్రిపై కేసు

    • వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

    • 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కేసు నమోదు

    • కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణి

    • పోలీసు అధికారులు సప్తసముద్రాల అవతల ఉన్నా, తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ కాకాణి ఘాటు వ్యాఖ్యలు

    • టీడీపీ వాళ్లను వదిలేది లేదంటూ బహిరంగంగా కాకాణి బెదిరింపులు

    • కాకాణిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వంటేరు ప్రసన్న