Share News

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:08 PM

దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు
CPI Leader Raja VS MODI Government

ప్రకాశం, ఆగస్టు25, (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వంపై (MODI Government) సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (CPI Leader Raja) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్‌గా ఈడీ, ఐటీలను బీజేపీ (BJP) ప్రభుత్వం వాడుతోందని విమర్శించారు. దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని.. బీహార్‌లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. బీహార్‌లో ఎన్నికల కమిషన్ విధుల్లో ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని ఆరోపించారు. ఇవాళ(సోమవారం) ప్రకాశం జిల్లాలో సీపీఐ నేత రాజా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.


ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. ధన్‌ఖడ్ రాజీనామా వెనుక రాజకీయ వత్తిడిలు ఉన్నాయని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు. సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. భారత్ - పాకిస్థాన్ యుద్దం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారని అన్నారు. యుద్దం ఎవరూ ఆపారో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. భారత్‌పై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్‌కి ట్రంప్ ఎలా చెబుతారని నిలదీశారు సీపీఐ నేత రాజా.


సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) మరణం తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సుధాకర్ రెడ్డి జీవితాంతం పోరాటం చేశారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా సీపీఐ పోరాటం చేస్తోందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు. అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టెందుకే గిరిజన ప్రజలను చంపుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి

ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:24 PM