Share News

Prakasam Barrage: ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ.. జాగ్రత్తలు పాటించాలని సూచనలు..

ABN , Publish Date - Aug 29 , 2025 | 07:54 AM

పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.29, ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కలు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Prakasam Barrage: ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ.. జాగ్రత్తలు పాటించాలని సూచనలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ నిన్న(గురువారం) మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. కృష్ణానది వరద ప్రవాహం తగ్గటంతో.. ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్‌లోకి 3,94,790 క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. ఈ వరద నీటిని నియంత్రించేందుకు ప్రకాశం బ్యారేజ్‌లోని 66 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.


కాగా, శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.95, ఔట్ ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.52, ఔట్ ఫ్లో 2.47 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.29, ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కలు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.3 అడుగుల నీటిమట్టం, కూనవరం వద్ద 17.06 మీటర్లు, పోలవరం వద్ద 11.45 మీటర్లు నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.


భారీ వర్షాలు, నదుల ప్రవాహం దృష్ట్యా వినాయక నిమజ్జనాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పెరుగుతున్న గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం నేపథ్యంలో నది పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు.. ఏదైనా.. సమస్య ఉంటే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే.. అటవీ ప్రాంతాల ప్రజలు వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆయన వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ చ‌ట్టం ముందు దోషిగా నిల‌బడక త‌ప్పదు..

ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 07:54 AM