CM Chandrababu Naidu: సుబ్బానాయుడు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం..
ABN , Publish Date - Oct 20 , 2025 | 09:45 AM
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అమరావతి: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి సుబ్బానాయుడు క్షేమంగా తిరిగి వస్తారనుకున్నానని, కానీ ఆయన అకాలమృతిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సుబ్బానాయుడు శక్తివంచన లేకుండా కృషి చేశారని సీఎం గుర్తు చేశారు. నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు..
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూటమి అధికారంలోకి రావడానికి సుబ్బానాయుడు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం సుబ్బానాయుడు మృతికి మంత్రి నారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ సుబ్బానాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బ్రెయిన్ స్ట్రోక్‌తో గత పది రోజులుగా విజయవాడలోనే మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఇవాళ(సోమవారం) తుదిశ్వాస విడిచారు. అయితే నిన్న(ఆదివారం) సుబ్బానాయుడు అన్న కొడుకు భానుచందర్ నాయుడు అకాల మరణం పొందారు. కాగా, ఇవాళ అనారోగ్యంతో సుబ్బానాయుడు కన్నుమూయడంతో.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు
JEE Main 2026: జేఈఈ మెయిన్-2026షెడ్యూల్ విడుదల