Share News

Nellore Sad incident: ఏపీలో ఘోరం.. విద్యార్థులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:59 AM

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్‌లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...

Nellore Sad incident: ఏపీలో ఘోరం.. విద్యార్థులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Nellore Sad incident

నెల్లూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల (Road Accident) నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది వాహనదారులు అత్యంత వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో వాహనదారులు మరణిస్తుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లాలో ఇవాళ (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు.


ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్‌లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్నఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో పులికిరణ్ (12) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. సోదరుడు కార్తీక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గంగపట్నం వెంకటరెడ్డి కాలనీకి చెందిన బాలుడుగా గుర్తించారు పోలీసులు. కొంతకాలం క్రితమే బాలుడు తండ్రి విద్యుదాఘాతంతో మృతిచెందారు. కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహం వద్ద తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు

ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

Read Latest AP News and National News

Updated Date - Dec 08 , 2025 | 12:07 PM