PM Narendra Modi ON AP Visit: ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ తెలుగులో ఆసక్తికర ట్వీట్
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:37 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
కర్నూలు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా (Kurnool District)లో గురువారం పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. అచ్చమైన తెలుగులో ఈ ట్వీట్ పెట్టడం విశేషం.
పలు అభివృద్ధి పనులకి ప్రధాని మోదీ శంకుస్థాపన..
ఆంధ్రప్రదేశ్‌లో ‘రేపు(అక్టోబర్ 16)వ తేదీన పర్యటిస్తాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News