Share News

Minister Anam on Srisailam: శ్రీశైలం ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి ఆనం

ABN , Publish Date - Oct 15 , 2025 | 09:03 PM

శ్రీశైలం లాంటి దివ్య క్షేత్రాన్ని మరింత తీర్చిదిద్దాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉండటం దేశంలోనే ఎక్కడా లేని విశేషమని అభివర్ణించారు.

Minister Anam on Srisailam: శ్రీశైలం ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి ఆనం
Minister Anam Ramanarayana Reddy on Srisailam Development

శ్రీశైలం, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం (Srisailam) లాంటి దివ్యక్షేత్రాన్ని మరింత తీర్చిదిద్దాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉండటం దేశంలోనే ఎక్కడా లేని విశేషమని అభివర్ణించారు. శ్రీశైలం క్షేత్రంలో స్వామివారిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ(బుధవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. శ్రీశైల క్షేత్రం చుట్టుపక్కల ఉన్న అనేక ఆలయాలను కూడా ఈ ఆలయం పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ ఇప్పటికే చాలావరకు పూర్తయ్యిందని... తుది మెరుగులు దిద్దాల్సి ఉందని తెలిపారు. చిన్న చిన్న మార్పులు చేసి విడుదల చేస్తామని వివరించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.


ఎక్కువ మంది భక్తులని ఇక్కడకు ఆకర్షించేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. జ్యోతిర్లింగాల్లోనూ, అష్టాదశ శక్తి పీఠాల్లోనూ ప్రముఖమైనదిగా శ్రీశైలం ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు వెళ్తున్నారని ఉద్ఘాటించారు. పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో రేపు(గురువారం) కర్నూలు సభలో ప్రధానమంత్రి నరేద్ర మోదీ, సీఎం చంద్రబాబు చెబుతారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 09:06 PM