Chandrababu Naidu: కర్నూల్ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:53 AM
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు.
అమరావతి: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. దీంతో సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను సీఎం తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత ఆ బైకు బస్సు కిందికి వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులు మృతిచెందగా.. పలువురు గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు