Share News

Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:45 AM

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) చేపట్టడానికి సన్నాహాలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు...

Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి

  • రాష్ట్రాల సీఈఓలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 23: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) చేపట్టడానికి సన్నాహాలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు (సీఈఓ)లను ఆదేశించింది. ఈ సన్నాహాల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నివేదికలు పంపించాలని సూచించింది. గురువారం ఇక్కడ ముగిసిన ఈసీఓల సదస్సులో ఈ సూచనలు చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ‘సర్‌’కు సంబంధించిన పలు అంశాలను ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారులు వివరించారు. పలు సందేహాలను తీర్చారు. ఈ సమావేశాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 06:46 AM