CM Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:29 PM
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
అమరావతి, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (MLA Budda Rajasekhar Reddy) తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. అటవీ సిబ్బందితో రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దాడి చేశారని ప్రచారం..
శ్రీశైలం శిఖరం వద్ద ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. నెక్కంటి అటవీ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఉప అటవీ క్షేత్రాధికారి, బీట్ అధికారులపై ఎమ్మెల్యే దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ నలుగురు సిబ్బందిని కారులో శ్రీశైలం చుట్టూ తిప్పుతూ ఎమ్మెల్యే దాడి చేశారని ప్రచారం జరిగింది. వాకీటాకీలు, మొబైల్స్, తీసుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
మరోవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఏపీ సచివాలయానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ వచ్చారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ పట్ల దగ్గుపాటి వెంకటప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు దుర్గాప్రసాద్ వచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అనంతపురం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి నిన్న(మంగళవారం) భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీరియస్‌గా టీడీపీ అధిష్టానం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబును దగ్గుపాటి వెంకటప్రసాద్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News