Share News

Vijayawada Indrakiladri Durga Temple: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:42 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర ఆలయానికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీని మంగళవారం లెక్కించారు ఆలయ అధికారులు. 2025 దసరా హుండీ ఆదాయం రూ. 10.30 కోట్లు దాటింది.

Vijayawada Indrakiladri Durga Temple: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం
Vijayawada Indrakiladri Durga Temple

విజయవాడ, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర ఆలయానికి (Vijayawada Indrakiladri Durga Temple) రికార్డు స్థాయి హుండీ ఆదాయం (Hundi Income) వచ్చింది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీని ఇవాళ(మంగళవారం) లెక్కించారు ఆలయ అధికారులు. 2025 దసరా హుండీ ఆదాయం రూ. 10.30 కోట్లు దాటింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది హుండీ ఆదాయం కోటి రూపాయలు ఎక్కువగా వచ్చింది. 2024 దసరా హుండీ నగదు రూ.9.32 కోట్లు కాగా.. 2025లో రూ.10.30 కోట్ల ఆదాయం చేరింది.


రెండు రోజుల పాటు హుండీ లెక్కింపులు నిర్వహించారు ఆలయ అధికారులు. మొత్తం 106 సంచులు, 480 హుండీలు తెరచి లెక్కించారు. మొదటి రోజు హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు, రెండో రోజు రూ. 6.73 కోట్ల ఆదాయం చేరింది. మొత్తం బంగారం 387 గ్రాములు, వెండి 19 కేజీలు 450 గ్రాములు వచ్చింది. పలు దేశాల నుంచి విదేశీ కరెన్సీ ఇచ్చారు. భక్తుల విరాళాలతో అమ్మవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 08:07 PM