YS Jagan Moha Reddy: జగన్ కాన్వాయ్ ఢీ.. పలువురికి గాయాలు..
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:54 PM
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్ అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒక దాని కొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనాలు నిలిచిపోయాయి. ఎంత మెుర పెట్టుకుంటున్నా వినకుండా.. జగన్ కాన్వాయ్ ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.
పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు.
అయితే గతంలో కూడా.. మాజీ సీఎం జగన్ పర్యటనలో ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఓ వ్యక్తి కారు కిందపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వెంగళాయపాళెం గ్రామానికి చెందిన 50 ఏళ్ల చీలి సింగయ్య జగన్ కారు కిందపడి ప్రాణాలు విడిచారు. అలాగే.. అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటనలో కూడా వివాదం చోటుచేసుకుంది. జగన్ హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. ఆయన చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. దీంతో జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్(అద్దాలు) ధ్వంసమైయ్యాయి.
అయితే మాజీ సీఎం జగన్ పర్యటనలో.. ఘోరాలు, నేరాలు జరుగుతున్న ఆయన మాత్రం పర్యటనలు మానడం లేదు. పర్యటనల పేరుతో.. వైసీపీ కార్యకర్తల, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి గురించి ఏమాత్రం శ్రద్ధ చూపకుండా.. తన ఇష్టారాజ్యంగా పర్యటనలు చేస్తూ.. జగన్ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యటన సమయంలో.. పోలీసుల, అధికారుల నిబంధనలను పట్టించుకోకుండా.. పర్యటనలు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక