Heavy Rains in AP: రెయిన్ ఎఫెక్ట్.. ఏపీలో రాగల మూడు గంటల్లో భారీ వర్షం..
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:56 PM
వాతావరణంలో ఏర్పడిన మార్పులతో రాగల మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో ఏర్పడిన మార్పులతో రాగల మూడు గంటలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఈదురుగాలుల వీచే సమయంలో హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని ఎండీ ప్రఖర్ జైన్ అప్రమత్తం చేశారు.
విజయవాడలో భారీ వర్షం
మరోవైపు.. విజయవాడ (Vijayawada) నగరంలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. భారీ వర్షం ధాటికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాన కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కరెంట్ పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
Read Latest AP News And Telugu News