Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 07:26 PM
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టు నిందితుల రిమాండ్ ఈ రోజు ముగియాల్సి ఉంది. అయితే, పోలీస్ అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు కోసం రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులకు (Maoists) మరో బిగ్ షాక్ తగిలింది. పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టు నిందితుల రిమాండ్ ఈ రోజు(సోమవారం) ముగియాల్సి ఉంది. అయితే, మావోయిస్టులను మరింత సమగ్రంగా విచారించాలని పోలీసులు భావించారు. ఈక్రమంలో మావోల రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట హాజరు పరిచారు పోలీసు అధికారులు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులకు 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు న్యాయాధికారి. ప్రస్తుతం నెల్లూరులోని కేంద్ర కారాగారంలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా మావోయిస్టులు ఉన్నారు. వీరిని రిమాండ్‌లోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులు అనుకున్నారు. మావోయిస్టులను విచారిస్తే మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..
ఏపీ కేబినెట్‌లో 24 అంశాలపై చర్చ.. జిల్లాల పునర్వవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News