Pulivendula: ఎక్స్‌ట్రాలు చేస్తే కాల్చి పడేస్తా.. వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్..
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:42 PM
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్‌కు పోలీసులు తరలించారు.
కడప: పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్‌కు పోలీసులు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య డీఐజీ కోయ ప్రవీణ్, అవినాష్ రెడ్డిని కలిశారు. భద్రతా కారణాల దృష్ట్యా వైసీపీ కార్యకర్తలను ఆఫీస్ ఖాళీ చేయాలని డీఐజీ ఆదేశించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ మురళి నాయక్ వైసీపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు వైసీపీ కార్యకర్తలైతే.. తనది ఖాకీ యూనిఫామ్ అని.. ఎక్స్‌ట్రాలు చేస్తే.. కాల్చిపడేస్తానంటూ.. మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు
ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు