Share News

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Sep 16 , 2025 | 09:01 PM

1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు
Venkaiah Naidu on NTR Book Launch

అమరావతి, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలదోశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ని అన్యాయంగా గవర్నర్ రామ్ లాల్‌తో కలిసి నాదెండ్ల భాస్కరరావు దించివేశారని చెప్పుకొచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)కి సంబంధించిన ’సజీవ చరిత్ర’ (Sajeeva Charitra) పేరిట రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ(మంగళవారం) పోరంకిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు.


1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని తెలిపారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ మూడు దశాబ్దాల కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగురేసిన వ్యక్తి అని ఉద్ఘాటించారు వెంకయ్య నాయుడు.


వెంకయ్య నాయుడు ప్రసంగంలోని ముఖ్య అంశాలు...

  • వెనుకబడిన వర్గాలకు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులను కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు.

  • ఆనాడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలు ఎన్టీఆర్ వెనక నిలబడ్డారు.

  • ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మెజార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహారించింది.

  • కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని వంచించే ప్రయత్నం చేశారు.

  • తెలుగు అధ్యయన కేంద్రం మైసూర్‌లో ఉండకూడదన్న ఉద్దేశంతో తాను నెల్లూరుకు తీసుకువచ్చాను.

  • తెలుగులోనే పరిపాలన జరగాలి.

  • ప్రాథమిక విద్య సైతం తెలుగులోనే కొనసాగాలి.

  • గత పాలకులు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ లేకుండా చేశారని వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • మన ముఖ్యమంత్రి కూడా ఆయన కంటే ఎక్కువ హామీలు ఇస్తానని అన్నారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.

  • ఎక్కువ హామీలు ఇవ్వడంలో ఇబ్బంది లేదు కానీ ముందు ఎక్కువ ఆదాయం రావాలి.. అప్పుడు ఇవ్వచ్చు .. లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాం.

  • పేదరిక సమస్యను పరిష్కరించాలంటే ఉచిత పథకాలతో సాధ్యం కాదు.

  • ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టి వారి కాళ్లపై స్వతహాగా నిలబడే విధంగా మార్గం చూపించాలి.

  • పేదలకు మార్గం చూపించాలి కానీ ఉచిత పథకాలు ఇవ్వకూడదు.

  • నిస్సహాయులు, వృద్ధుల లాంటి వారికే ఉచిత పథకాలు అందాలని నేను భావిస్తున్నాను.

  • అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే చూడాలన్నది నా కోరిక.

  • నేను పదవికి విరమణ చేశా గాని పెదవికి మాత్రం కాదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.


నాదెండ్ల భాస్కరరావుపై విజయం సాధించిన ఘనత నాదే: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి

’సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 1984లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. 1983లో మొదటిసారి ఎమ్మెల్యేని అయ్యానని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవిధంగా వ్యవహరించాలన్నది సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. అపోజిషన్ వారు అసెంబ్లీలో ప్రశ్నలను సంధిస్తే ఎన్టీఆర్ చాలా పాజిటివ్‌గా స్పదించేవారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో చెప్పినవన్నీ నిజ జీవితంలోనూ ఆచరించారని ఉద్ఘాటించారు. నాదెండ్ల భాస్కరరావుపై విజయం సాధించిన ఘనత కూడా తనదేనని గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు

జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 16 , 2025 | 09:33 PM