Shivraj Singh: గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పర్యటన..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:26 PM
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.
గుంటూరు జిల్లా, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ఇవాళ(మంగళవారం) పర్యటించారు. నల్లపాడు లయోలా స్కూల్లో పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహ్మద్ నజీర్, గల్లా మాధవి , మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద వెంగళాయపాలెం చెరువు వద్ద రూ.1.20కోట్లతో చేసిన అభివృద్ధి పనులని పరిశీలించారు శివరాజ్ సింగ్ చౌహన్.
ఈ సందర్భంగా పైలన్‌ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, పెమ్మసాని చంద్రశేఖర్. వెంగళాయపాలెం చెరువును శివరాజ్ సింగ్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పురాతన వెంగళాయపాలెం చెరువుని అత్యాదునికంగా పునరుద్ధరించారని వ్యాఖ్యానించారు శివరాజ్ సింగ్ చౌహన్.
వెంగళాయపాలెం చెరువు ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. వెంగళాయపాలెం చెరువు ద్వారా పశువులకు తాగునీరు లభిస్తుందని వెల్లడించారు. మత్స్య సంపద పెంచడానికి, బోటింగ్ సౌకర్యానికి ఈ చెరువుని ఉపయోగించవచ్చని వివరించారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఓపెన్ థియేటర్ వంటివి ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచుతాయని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News