Azad Jayanti: సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:03 AM
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేష్ కొనియాడారు.
అమరావతి, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (Maulana Abul Kalam Azad Jayanti) సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి నివాళి అర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ పెట్టారు.
దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు: సీఎం చంద్రబాబు
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతీయ విద్యా దినోత్సవ, మైనార్టీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.
మౌలానా ఆజాద్ దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు: మంత్రి నారా లోకేష్
స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పేర్కొన్నారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని స్మరించుకుంటూ మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్.
ఈ వార్తలు కూడా చదవండి...
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పర్యటన..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News