Share News

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Nov 11 , 2025 | 08:31 AM

ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

Road Accident:  ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident

కృష్ణాజిల్లా, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల (Road Accident) నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడప దడప ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. మీతిమిరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో వాహనదారులు మృతిచెందుతుండటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఇవాళ(మంగళవారం) ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మృతులు కుందేరు గ్రామానికి చెందిన చింతయ్య(17), రాకేష్ బాబు(24), ప్రిన్స్ (24)లుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.


జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. ట్రాఫిక్‌ని పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. కారు అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుల మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 08:45 AM