SIT Raids on AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:46 PM
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి (Narreddy Sunil Reddy) కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. పది కంపెనీలకు గానూ ఐదు కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంల్లోని ఐదు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 -స్నేహా హౌస్, బంజారాహిల్స్ - రోడ్ నెంబర్ - 2- సాగర్ సొసైటీ, కాటేదాన్ - రాజేందర్ నగర్, ఖైరతాబాద్ - కమలాపురి కాలనీ - ఫేజ్ వన్‌లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వాల్తేర్ రోడ్ - వెస్ట్ వింగ్ - విశాఖపట్నంలో ఉన్న మరో కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ - విశాఖపట్నంల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు (SIT Officers Raids). హైదరాబాద్‌లోని 8 కంపెనీలకు గానూ 4 కార్యాలయాలు, విశాఖపట్నంలోని రెండు కంపెనీల్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు సునీల్ రెడ్డి.
ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్‌ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు సునీల్ రెడ్డి. ప్రైవేట్ లిమిటెడ్, LLP, ఫౌండేషన్ హోదాల్లో సునీల్ రెడ్డి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తుండటంతో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest Andhra Pradesh News and National News