AP GOVT: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:14 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. ఏపీ సర్కార్ మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో కీలక బదిలీలు (AP Municipal Transfers) చోటుచేసుకున్నాయి. ఏపీ సర్కార్ ( Andhra Pradesh Government) మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పలు పట్టణాల్లో పరిపాలనా మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ బదిలీలతో మున్సిపల్ పరిపాలనలో సమర్థత పెంచడం, పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వివిధ పట్టణాల్లో కొత్త అధికారుల నియామకంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
బదిలీల వివరాల ప్రకారం..
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా డి. పావనిని నియమించింది..
అనంతపురం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎం. అంజయ్యకు పోస్టింగ్ ఇచ్చింది.
తిరుపతి అదనపు మున్సిపల్ కమిషనర్‌గా యు. శారదాదేవిని నియమించింది.
పెడన మున్సిపల్ కమిషనర్‌గా డి. కొండయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ సహాయ కమిషనర్‌గా ఎం. మంజునాథ్ గౌడ్‌ను నియమించింది.
చీరాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్‌ను బదిలీ చేసింది.
ఆయన స్థానంలో డేనియల్ జోషెఫ్‌ను చీరాల మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది.
నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీని మత్స్యశాఖ రెవెన్యూ విభాగానికి కేటాయించింది.
నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్‌గా జి. వెంకటరామిరెడ్డిని నియమించింది.
కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీధర్‌ను నియమించింది
ప్రస్తుతం కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పి. కృష్ణమోహన్ రెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)లో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి
నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి
Read Latest AP News And Telugu News