Pawan Kalyan: కేరళకు పవన్ కల్యాణ్.. ఎందుకంటే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:46 PM
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్యమహర్షి ఆలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.

అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈరోజు నుంచి 11 ఆలయాలను పవన్‌కల్యాణ్ దర్శించుకోనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు.
ఈరోజు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సందర్శనలో పవన్‌తో పాటు కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని దర్శించి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.
పవన్ కల్యాణ్‌కు ఆరోగ్య సమస్యలు..
కాగా.. గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ రావడంతో కొంత విశాంత్రి తీసుకున్నారు. జ్వరం కారణంగా కేబినెట్ సమావేశాలకు కూడా పవన్ దూరంగా ఉంటున్నారు. డిప్యూటీ సీఎం లేకుండానే బుధవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. స్పాండిలైటిస్ కారణంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్‌తో మాట్లాడేందుకు తాను కూడా ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News