Pawan Kalyan ON Auto Driver Scheme:జగన్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు : పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:42 PM
జగన్ హయాంలో ఆటోడ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో ఆటోడ్రైవర్ల (Auto Drivers)కు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌ల కోసం రూ.436 కోట్లు అవుతోందని.. ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని వివరించారు. ఆటోడ్రైవర్ల జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇన్ని కష్టాల్లో తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
ఆటోడ్రైవర్ల సేవలో పథకంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. స్త్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు.. ముందుగా ఆటోడ్రైవర్ల గురించే ఆలోచించామని తెలిపారు. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా రూ.15వేలు ఆటోడ్రైవర్లకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నంచేసి అమలు చేశారని నొక్కిచెప్పారు. సీఎంకి ఆటోడ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్
Read Latest AP News And Telugu News