Share News

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 11 , 2025 | 03:37 PM

తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): సనాతర ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు.


తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని నొక్కిచెప్పారు.


సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకికతత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని ఉద్ఘాటించారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 03:41 PM