Palnadu District car Accident: పల్నాడు జిల్లాలో కారు ప్రమాదానికి కారణమిదేనా..
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:07 PM
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పల్నాడు జిల్లా, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై నిన్న(గురువారం) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై అనుమానిత కంటైనర్‌ను ఆర్టీవో అధికారులు ఆపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కంటైనర్‌ను పట్టుకోవడానికి ఆర్టీవో అధికారులు వారి వాహనాన్నిరోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీంతో కంటైనర్ డ్రైవర్ ఆపే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించని విద్యార్థులు కారుతో అత్యంత వేగంతో వచ్చి కంటైనర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే నలుగురు విద్యార్థులు అయ్యప్ప మాలలో ఉన్నారు. రేపు(శనివారం) శబరిమల యాత్ర వెళ్లేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన
Read Latest AP News and National News