Share News

NTR Vaidya Seva Trust: ఏపీలో వైద్య సేవలకు బ్రేక్.. అసలు విషయమిదే

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:24 PM

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది.

NTR Vaidya Seva Trust: ఏపీలో వైద్య సేవలకు బ్రేక్.. అసలు విషయమిదే
NTR Vaidya Seva Trust

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ (NTR Vaidya Seva Trust) కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని అసోసియేషన్ పేర్కొంది.


రోగులకు చికిత్స అనంతరం నిర్వహిస్తున్న ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రిలో చికిత్స తర్వాత రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వేస్తున్న ప్రశ్నలతో రోగులు, ఆస్పత్రుల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని తెలిపింది అసోసియేషన్. యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించే సమయంలో కనీసం ఆస్పత్రులతో చర్చలు కూడా జరపలేదని చెప్పింది అసోసియేషన్.


ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా కింద ఓపీడీ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అధికారులు చొరవ తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా సీఈఓకి ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ లేఖ అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం

మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ అభినందనలు

For AP News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 05:25 PM