Collector Conference In CM Chandrababu: తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:35 AM
ప్రపంచంలోనే తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 15: నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించ కలుగుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్ అని ఆయన చెప్పారు. 15 శాతం వృద్ధిరేటు సాధించగలగాలంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు.
తలసరి ఆదాయం పెంచేలా కృషి చేయాలని వారికి సూచించారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టు కోంటామని ఆయన ఆకాంక్షించారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లందరికీ ప్రజల తరపున ఆయన అభినందనలు చెప్పారు. పాత కలెక్టర్లు సైతం తమ పని తీరును నిరూపించుకోవాలని కోరారు. జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందని ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
పాలసీ ఇవ్వడమే కాదే.. అమలు చేయడం ముఖ్యమన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎకో సిస్టమ్ తయారు చేయాలి.. భారత్ ప్రథమస్థానంలో నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మోదీ ప్రధానిగా వచ్చాక 11వ స్థానంలో ఉన్నామని.. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైందని వివరించారు.
ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసే వాళ్లమని.. కానీ ప్రస్తుతం మనతోనే సమానంగా చూస్తున్నామన్నారు. 1991కి ముందు సంస్కరణలు రాలేదన్నారు. దీంతో ఆర్థిక వృద్ధి కేవలం రెండు లేదా మూడు శాతంగా ఉండేదని గుర్తు చేశారు. దేశ వృద్ధి రేటు చూపి అప్పుడు ఎగతాళి చేసే వారని పేర్కొన్నారు.
అలాగే టెక్నాలజీపై మాట్లాడితే అవహేళన సైతం చేశారని తెలిపారు. సంస్కరణలు కావాలని మాట్లాడితే చాలా మంది వద్దన్నారన్నారు. ఆనాడు వద్దన్న రాజకీయ పార్టీల మనుగడే ఇప్పుడు లేకండా పోయిందని ఆయన వివరించారు. ఈ ప్రభుత్వం రాగానే నిర్దిష్టమైన విధానం.. వికసిత్ భారత్ 2047 తయారు చేసిందన్నారు. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశామని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For AP News And Telugu News