Share News

Mega DSC Final List:మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ అభినందనలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 09:58 AM

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు అయింది.

Mega DSC Final List:మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ అభినందనలు

అమరావతి, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు అయింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు కలెక్టరేట్‌లో డీఎస్సీ తుది జాబితాను ప్రదర్శనకు ఉంచారు.

అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్‌లో డీఎస్సీ తుది ఎంపిక జాబితా ఉంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఏపీ మెగా డీఎస్సీ - 2025లో ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. అలాగే apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా లభ్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.


స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు..

మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేసిన అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ.. ఈ రోజు శుభదినమన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రిగా నారా లోకేష్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఈ తుది సెలక్షన్ లిస్టు ఇప్పుడే రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఎంతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం తమకు ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.


దాదాపు వందకుపైగా కేసులు ఉన్నా.. ఎక్కడా ఆటంకం రాకుండా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు సంబంధించి 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి.. అందులో సోమవారం 15,941 మందికి అపాయింట్‌ ఇస్తున్నామన్నారు. అయితే ఈ సారి ఎస్సీ వర్గీకరణను సైతం పరిగణలోనికి తీసుకున్నామని తెలిపారు. కాల్ సెంటర్‌లలో వచ్చిన కాల్స్ అన్నింటింకి పరిష్కారం చేశామని తెలిపారు.


తుది జాబితాలో 49.9 శాతం మంది మహిళలు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి లోకష్ తదితరుల సమక్షంలో అపాయింట్‌మెంట్ ఇస్తామన్నారు. వీరికి జిల్లాల్లో ట్రైనింగ్స్ ఇచ్చి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా అందజేస్తాని తెలిపారు. ఈ లిస్టును అన్ని చోట్ల పబ్లిష్ చేస్తున్నాం... హరిజంటల్ రిజర్వేషన్ ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు డిఈవో ఆఫీసుల్లో చెప్ప వచ్చని అభ్యర్థులకు వారు సూచించారు.


దీనిలో వెయిటింగ్ లిస్టు... సెకండ్ లిస్టు ఉండదన్నారు. 406 ఫిల్ కానివి వచ్చే డీఎస్సీకి వెళుతుందని చెప్పారు. వచ్చే టెట్ నవంబర్‌లో ఉంటుందని.. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు తయారు కావాలని కోరుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రతి సంవత్సరం క్లాసులు స్టార్ట్ కాక ముందే రిక్రూట్‌మెంట్ల కంప్లీట్ చేయాల్సి ఉందన్నారు.


హైకోర్టు ఆర్డర్‌కు అనుగుణంగా సెలక్షన్ లిస్టు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ డిలే అయ్యే అవకాశం ఉందో వాటన్నింటిని ముందుగానే సవరించడం వల్ల కోర్టు కేసులు పడలేదని చెప్పారు. సెక్రటేరియట్ వెనుక ఈనెల 19వ తేదీన ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

సెప్టెంబర్ 22 నుండి ట్రైనింగ్ తరువాత కౌన్సిలింగ్ ద్వారా వారికి పోస్టింగ్ ఇస్తామని వివరించారు. 150 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తి చేశామన్నారు. ప్రతి క్యాండిడేట్ ఎందుకు సెలెక్ట్ అయ్యారనే విషయం కూడా వారికి ప్రత్యేకంగా చెప్పామని తెలిపారు. సుప్రీంకోర్టు సూచనలు మేరకు స్పెషల్ రిక్రూట్‌మెంట్‌పై త్వరలో కసరత్తు చేస్తామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

కాంగ్రెస్ కమీషన్ల సర్కారంటూ.. కవిత మళ్లీ ఫైర్

For AP News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 11:52 AM