Share News

Drama Competition: నవంబర్ 5న బాలల లఘు తెలుగు నాటికల జాతీయ పోటీలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 03:41 PM

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యలో మూడో ప్రపంచ తెలుగు మహా సభలు 5 నవంబర్ 2025 జరుగనున్నాయని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహా సభలు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రం గుంటూరులో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

Drama Competition: నవంబర్ 5న బాలల లఘు తెలుగు నాటికల జాతీయ పోటీలు
National Telugu Drama Competition

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు (Andhra Saraswatha Parishat), ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో (Tagore Memorial Trust) మూడో ప్రపంచ తెలుగు మహా సభలు (World Telugu Conferences) నవంబర్ 5(11-5 - 2025)న జరుగనున్నాయని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహా సభలు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రం గుంటూరులో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలకు సంచాలకులుగా అభినయ శ్రీనివాస్, మానాపురం సత్యనారాయణ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.


8 నుంచి 15 సంవత్సరాల్లోపు వారికి పోటీలు...

ఈ మహాసభల్లో 8 నుంచి 15 సంవత్సరాల్లోపు వారికి జాతీయస్థాయి బాలల లఘు తెలుగు నాటికల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు విద్యాలయాల తరఫున గానీ, సాంస్కృతిక సంస్థల నుంచి గానీ ఎంట్రీలు పంపవచ్చని సూచించారు. నాటిక నిడివి 15 నిమిషాలు మాత్రమే ఉండాలని తెలిపారు. నాటిక స్క్రిప్ట్‌ను అక్టోబర్ 15వ తేదీలోగా వాట్సాప్ నెంబరు - 8331020896కు పీడీఎఫ్ ద్వారా పంపించాలని సూచించారు.


నాటిక స్క్రిప్ట్‌‌లో ఇవి ఉండొద్దు...

ఎన్నికైన నాటికల వివరాలను నేరుగా సంస్థలకు తెలియజేస్తారని అన్నారు. నాటిక స్క్రిప్ట్‌‌లో జాతీయ సమైక్యతకు భంగం వాటిల్లే అంశాలు, సంభాషణలు ఉండరాదని కోరారు. నాటిక ప్రదర్శనకు వేదిక, లైటింగ్ , సౌండ్ సిస్టమ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అర్హత సాధించిన నాటికకు అభినందన ప్రశంసాపత్రం, పాత్రధారులకు అభినందన పతకాలు, ప్రశంసాపత్రం అందజేస్తామని చెప్పుకొచ్చారు. ప్రదర్శన రోజున భోజన, అల్పాహార ఏర్పాట్లు చేస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.


బహుమతులివే..

నాటిక ప్రథమ బహుమతి :10,000/-, పతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక

ద్వితీయ బహుమతి - రూ.7,500/- జ్ఞాపిక, పతకం, ప్రశంసాపత్రం

తృతీయ బహుమతి - రూ.5,000/- , పతకం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం

అలాగే, మూడు ప్రత్యేక బహుమతులు, అభినందన పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. నటులకు వ్యక్తిగత ప్రతిభా బహుమతులు ఉంటాయని ప్రకటించారు. విజేతలకు ప్రపంచ తెలుగు మహా సభల్లో ఈ బహుమతులు అందజేస్తామని ముఖ్య సమన్వయకర్తలు పీ.రామచంద్ర రాజు, వి.విద్యాసాగర్‌లు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 05:01 PM