Share News

AP Cabinet Meeting: వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Sep 19 , 2025 | 03:29 PM

వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్‌లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

AP Cabinet Meeting: వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
AP Cabinet Meeting

అమరావతి, సెప్టెంబర్ 19: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 13 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్‌గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.


వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్‌లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేశారు.


రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు క్యాబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు సంబంధించి మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్‌కు కన్వర్షన్‌కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు కూడా మంత్రిమండలిలో ఆమోదముద్ర పడింది.


ఇవి కూడా చదవండి..

ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 03:35 PM