Share News

Supreme Court Gali Brothers: ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:09 PM

గాలి బ్రదర్స్‌కు అనుకూలంగా జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

Supreme Court Gali Brothers: ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court Gali Brothers

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఓబుళాపురంలో గాలి బ్రదర్స్ (Gali Brothers) అక్రమమైనింగ్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ సరిహద్దుల ఖరారుపై జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. అక్రమైనింగ్‌పై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది సుప్రీం.


గాలి బ్రదర్స్‌కు అనుకూలంగా జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్ కొనసాగించడానికి గాలి బ్రదర్స్‌కు అనుమతి ఇవ్వాలని జగన్ సర్కార్ అఫిడవిట్‌లో పేర్కొంది. దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అమెకస్ క్యూరీ అఫిడవిట్ దాఖలు చేశారు.


ఈ నేపథ్యంలో అమెకస్ క్యూరీ నివేదికను పరిగణలోకి తీసుకొని జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు సీనియర్ కౌన్సిల్ సిధ్దార్ధ లూత్రా, గుంటూరు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఏపీ, కర్నాటక సరిహద్దుల మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అక్రమంగా వేలాది టన్నులు ఇనుప ఖనిజాన్ని తవ్వి ఎగుమతి చేశారు గాలి బ్రదర్స్. ఈ క్రమంలో గాలి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా గతంలో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై గత 15 ఏళ్లుగా సుప్రీంలో విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ కుదింపు.. తాజా మార్పులు ఇవే

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 01:24 PM