Tirupati: బ్రహ్మోత్సవాలకు ముందు అలజడికి భూమన అజెండా..
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:52 PM
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు అలజడి సృష్టించడానికి భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) రహస్య అజెండాతో ఉన్నారనే అనుమానం కలుగుతోందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి(Bhanuprakash Reddy) అన్నారు.
- టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు అలజడి సృష్టించడానికి భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) రహస్య అజెండాతో ఉన్నారనే అనుమానం కలుగుతోందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి(Bhanuprakash Reddy) అన్నారు. శ్రీవారి ఆలయం ముందు గురువారం మీడియాతో మాట్లాడుతూ, అలిపిరి విగ్రహం ప్రచారంపై 41 నోటీసు ఇస్తే, 23న వస్తానని చెప్పడం వెనుక ఏదో ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.

‘శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్ర్తాలు సమర్పించేందుకు 24న సీఎం చంద్రబాబు తిరుమలకు రాబోతున్నారు. ఆ ముందురోజు వస్తానని పోలీసులకు చెప్పడం వెనుక రహస్య అజెండా ఉండచ్చు’ అన్నారు. కరుణాకరరెడ్డి వంటి వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News