Share News

AP Assembly 2025: ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ కుదింపు.. తాజా మార్పులు ఇవే

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:20 AM

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్‌ను ఈనెల 27 వరకు కుదించారు. అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్నాయి.

AP Assembly 2025: ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ కుదింపు.. తాజా మార్పులు ఇవే
AP Assembly 2025

అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల (AP Assembly Session) షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. నిన్న (గురువారం) స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగి బీఏసీ సమావేశంలో ఈనెల 30 వరకు అంటే పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే నిన్న సాయంత్రం అసెంబ్లీ షెడ్యూల్‌ను ఈనెల 27 వరకు కుదించారు. అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్నాయి. ఈ నెల 22న వ్యవసాయం, 23న శాంతి భద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్ ఉంటుందని షెడ్యూల్ చేసిన అధికారులు వెల్లడించారు.


25న ప్రభుత్వ బిజినెస్‌తో పాటు ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అలాగే 26న లాజిస్టిక్స్, ఉపాధికల్పన, పరిశ్రమలపై, 27న సూపర్ సిక్స్‌పై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు అసెంబ్లీ నడపాలని నిర్ణయించారు. కాగా.. ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 11:48 AM