TDP Slams YSRCP: వైసీపీ చలో మెడికల్ కాలేజ్ పిలుపుపై టీడీపీ నేత ఫైర్
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:21 AM
పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని వైసీపీ విష ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు (TDP Leader Areti Mahesh Babu) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యా వ్యవస్థను, మెడికల్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పుడు చలో పాడేరు మెడికల్ కాలేజీ అంటూ జగన్నాటకానికి తెర లేపారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణ నిమిత్తం గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జగన్ రెడ్డి దుర్వినియోగపరిచారని ఆరోపించారు.
పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ దొంగ నాటకాలు కట్టిపెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును వైసీపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సగానికి పైగా సీట్లను ప్రైవేటు పరం చేసింది వైసీపీనే అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్నారై కోటా సీట్లను ప్రవేశపెట్టిందే వైసీపీ అని గుర్తుచేశారు. జగన్ సీఎం కాకముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్నారై కోటా సీట్లు లేనేలేవని ఆయన తెలిపారు.
గత చంద్రబాబు ప్రభుత్వంలో మెడికల్ సీట్ వచ్చిన విద్యార్థి 15000 రూపాయలు చెల్లిస్తే మెడికల్ సీటు అడ్మిషన్ పొందేవారని అన్నారు. గత జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107 ,108 ,133 జీవోల వలనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని సీట్లను ప్రైవేటుపరం చేశారని ఆరేటి మహేష్బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాటకు దిగగింది. నేడు ఛలో మెడికల్ కాలేజ్‌లకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే మచిలీపట్నంలో ఛలో మెడికల్ కాలేజ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కాలేజ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజ్‌కు వెళ్లే రోడ్డులోనూ ఆంక్షలు విధించారు. మెడికల్ కాలేజ్‌కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్
మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
Read Latest AP News And Telugu News