Share News

BIG BREAKING: మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

ABN , Publish Date - Sep 19 , 2025 | 08:26 AM

తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు.

BIG BREAKING: మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్‌, పోచారం, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి స్పీకర్‌ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఈ నోటీసులు జారీ చేశారు. తద్వారా ఎమ్మెల్యేల విచారణను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ ప్రారంభించినట్లు అయింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

2023 ఏడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.


ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అంతేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో.. గులాబీ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.


మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పదుల సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీలోని నేతలకు గుర్తు చేస్తున్నారు. ఈ తరహా విమర్శలు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ వ్యవహారంలో కదలిక తీసుకువచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం.. వ్యక్తమవుతున్న నిరసనలు

5 ప్రధాన ఆలయాలకు చైర్మన్లు

For More TG News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 08:45 AM