Share News

Harish Slams Congress: కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:24 AM

మేడిగడ్డ టు మల్లన్న సాగర్ - మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట అంటూ హరీష్ వ్యాఖ్యలు చేశారు.

Harish Slams Congress: కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్
Harish Slams Congress

హైదరాబాద్, సెప్టెంబర్ 19: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంతా అవినీతిమయం అని అధికార పక్షం నేతలు, మంత్రులు ఆరోపిస్తుండగా.. ఎలాంటి అవినీతి లేదంటూ ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల బాణాలు దూసుకుంటూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.


హరీష్ రావు ట్వీట్

‘మేడిగడ్డ టు మల్లన్న సాగర్ - మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట! కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 TMC మాత్రమేనట కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట! 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా అసలైన మార్పంటే?’ అంటూ మాజీ హరీష్‌రావు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం.. వ్యక్తమవుతున్న నిరసనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 09:34 AM