AP Cabinet: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం.. ఈ 15 అంశాలే ఎజెండా
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:05 AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నేడు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలోని సీఎం పేషీలో ఈ సమావేశం జరగనుంది.
అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రి మండలి సమావేశం కానుంది. 15 అంశాలు ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు (AP Cabinet Meeting).
ఆగస్టు 31 లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్‌డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అన్‌ఆథరైజ్డ్‌గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలు ఏర్పాటుకు భూములు కేటాయింపునకు సంబంధించి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్‌కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేయొచ్చని సమాచారం
ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్-2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15 వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులను మంత్రిమర్గం ఆమోదించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్ ఆగ్రహం
చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News